Minister Sridhar Babu: గ్రూప్స్ పరీక్షలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కనీసం 40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గ్రూప్స్ పరీక్షలన్నీ పకడ్బందీగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కీలక ప్రకటన చేశారు. గ్రూపు-1 మెయిన్స్(Group-1 Mains)ను అడ్డుకునేందుకు విపక్షాలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారని.. విపక్షాల ప్రయత్నాల వల్ల నిరుద్యోగులకే నష్టమని పసిగట్టలేకపోయారని అన్నారు.
లోపాలు సవరించుకోవడంలో తమకు బేషజాలు లేవని శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే.. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని అన్నారు. అంతకుముందు సచివాలయం వేదికగా రైన్‌ల్యాండ్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీకి చెందిన రైన్‌ల్యాండ్ ఆసక్తి కనబర్చిందని వెల్లడించారు. ఫార్మా ఉత్పత్తులు, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్‌లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వాములు కావడం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించారు.