చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) శుక్రవారం విడుదల అయ్యారు.

Update: 2024-10-25 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) శుక్రవారం విడుదల అయ్యారు. ఆయనకు కుటుంబసభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌(Johnny Master)కు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇటీవల షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. జానీ తనపై 2019లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన సమయంలో హోటల్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఇండస్ట్రీ(Film Industry)లో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడు అంటూ ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్‌ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం విడుదల అయ్యారు. మొత్తం రెండు వారాల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో ఆయనకు ప్రకటించిన నేషనల్‌ అవార్డును నిలిపివేస్తున్నట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. 

Tags:    

Similar News