
దిశ, తెలంగాణ బ్యూరో: కార్పొరెట్ కంపెనీలలో అన్‌లైన్ చెల్లింపులపై జాగ్రత్త వహించాలని టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాల్స్ వచ్చినట్లు అనిపిస్తే లావాదేవీలు చేసే ముందు ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ ద్వారా ధృవీకరించుకుని చెల్లింపులు చేయాలని సూచించారు. ఇటీవల ఓ కంపెనీ ఎండీ పేరుతో అకౌటెంట్‌కి సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారని పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్సర్ చేశారని, కంపెనీ ఎండీ ఫిర్యాదు మేరకు వెంటనే డబ్బులు సేవ్ చేయగలిగామని తెలిపారు. ఫేక్ వాట్సప్ డీపీలతో కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్స్‌కి పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. . సైబర్ స్కామ్‌కు గురైనట్లు గుర్తించిన వెంటనే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.