స్వచ్ సోచ్ ఎన్జీవో లోగోను ఆవిష్కరించిన ప్రముఖులు

స్వచ్ సోచ్ ఎన్జీవో లోగోను శుక్రవారం రవీంద్రభారతిలో మాజీ మంత్రి గీతా రెడ్డి, వివేక్ ఎమ్మెల్యే వెంకటస్వామి, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, అంబేద్కర్ వాది జేబీ రాజు, లు ఆవిష్కరించారు

Update: 2024-12-27 12:51 GMT

దిశ, రవీంద్రభారతి : స్వచ్ సోచ్ ఎన్జీవో లోగోను శుక్రవారం రవీంద్రభారతిలో మాజీ మంత్రి గీతా రెడ్డి, వివేక్ ఎమ్మెల్యే వెంకటస్వామి, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, అంబేద్కర్ వాది జేబీ రాజు, లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వచ్ సోచ్ ఫౌండర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అందరికీ తెలియజేస్తూ పథకాలు అందేలా చూస్తామన్నారు. పేద విద్యార్థులకు సహాయం, అనాథలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా చర్యలు చేపడతామని ఆయన వివరించారు. స్వచ్ సోచ్ ఎన్జీవో సంస్థ ప్రారంభించిన సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను పాఠశాలలో చేర్పించి అన్ని వసతులు కల్పించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ సోచ్ అధ్యక్షురాలు సాజిద్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్, జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్, సభ్యుడు రామేశ్వర్ పాల్గొన్నారు.


Similar News