ముళ్లపూడి వెంకటరమణ తిరుగులేని రచయిత

ముళ్లపూడి వెంకటరమణ హాస్యానికి పెద్ద పీట వేస్తూ, తన రచనలో ఆద్యంతం హాస్యాన్ని పండిస్తూ తిరుగులేని రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా కొనియాడారు.

Update: 2024-06-28 16:01 GMT

దిశ, రవీంద్రభారతి : ముళ్లపూడి వెంకటరమణ హాస్యానికి పెద్ద పీట వేస్తూ, తన రచనలో ఆద్యంతం హాస్యాన్ని పండిస్తూ తిరుగులేని రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శోభ ఇంటర్నేషనల్ అకాడమీ నిర్వహణలో ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ 94వ జయంతి సందర్భంగా

    ప్రముఖ రచయిత ప్రసాద్ కు ముళ్లపూడి వెంకటరమణ స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డా. మోహన్ కందా, సభాధ్యక్షులుగా ఎస్వీ రామారావు, ప్రారంభకులు మామిడి హరికృష్ణ, సన్మాన కర్తగా ముళ్లపూడి శ్రీదేవి, ఆత్మీయ అతిథిగా లంక లక్ష్మీనారాయణ, విశిష్ట అతిథిగా యాట సత్య నారాయణ, శోభ ఇంటర్నేషనల్ అకాడమీ అధ్యక్షురాలు విదుషీమణి శోభరాణి తదితరులు పాల్గొన్నారు. ముళ్లపూడి శ్రీదేవి చేతుల మీదుగా ప్రముఖ రచయిత ప్రసాద్ కు వెంకటరమణ స్మారక పురస్కారం అందజేశారు.


Similar News