‘దయచేసి మరోసారి వాళ్ల ఇజ్జత్ తీయ‌కు’.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-18 03:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. పాగ‌ల్ ప‌నులు. వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్నట్లు్ంది ప‌రిపాల‌న. అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.. త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తుంది. మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది.

= మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయింది

= మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానం సాధించింది.

= బిల్డర్లను, రియ‌ల్ట‌ర్ల‌ను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది.

= మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ని పదకొండేళ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది.

= ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్త‌న భాండాగార‌మైంది. దేశంలోనే ధాన్య‌రాశిగా మారింది.

= పేద‌ల కంట క‌న్నీరు లేకుండానే Paris, Bogota, Mexico City, Montreal ల‌ను అధిగ‌మించి ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ గ్రీన్ సిటీ అవార్డును హైద‌రాబాద్‌ ద‌క్కించుకుంది.

మూసీ న‌దికి అటు ఇటు అభివృద్ధి క‌డుతున్న‌ప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ ప‌క్క‌న పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్ర‌ద‌ర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు?. ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. స‌మావేశాల్లో త‌ల కింద‌కి, మీద‌కి తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌దు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్ర‌భుత్వ బ‌డి పిల్ల‌ల ఇజ్జ‌త్ తీయ‌కు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లీష్ మాట్లాడ‌తారు. ప్ర‌పంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ నెట్టింట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



Similar News