మియాపూర్ లో ల్యాండ్ కబ్జా… ఓ మాజీ మంత్రి బంధువుల పై కేసు

తన పేరు పై ఉన్న ఆస్తిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు బంధువులు, మరికొందరు కలిసి తనకు తెలియకుండానే ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Update: 2024-10-18 04:46 GMT

దిశ, శేరిలింగంపల్లి : తన పేరు పై ఉన్న ఆస్తిని ఓ బీఆర్ఎస్ మాజీ మంత్రి బంధువులు, మరికొందరు కలిసి తనకు తెలియకుండానే ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ లో సర్వే నెంబర్ 44/1లో దండు లచ్చిరాజుకు ఓ బిల్డింగ్ ఉంది. దానిని చిట్టిబాబు అనే వ్యక్తి జీపీఏ చేసుకున్నాడు. అయితే ఓ నాయకుడి బంధువులు ఫాస్మోస్ హాస్పిటాలిటీ సర్వీస్ పార్ట్నర్ బోయినపల్లి వెంకటేశ్వర రావు, తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వర రావు, గారపాటి నాగరవి, గోని రాజ్ కుమార్, జంపని ప్రభావతి, ఫిట్జి లిమిటెడ్ బ్రాంచ్ నిర్వాహకులు, టి. పద్మారావు తదితరులపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను జీపీఏ చేసుకున్న ఆ స్థలం, బిల్డింగ్ తమదే అంటూ దానిని అక్రమించారని, అందులోకి తమను రానివ్వడం లేదని పేర్కొంటూ ఈనెల 5వ తేదీన చిట్టిబాబు మియాపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చిట్టిబాబు ఫిర్యాదుపై తన్నీరు గౌతమ్, బోయిన్ పల్లి వెంకటేశ్వరరావు, గోనెల రాజ్ కుమార్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై 420, 448, 504, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించిన వివాదం 2019 నుంచి కోర్టులో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News