హైదరాబాద్‌ను కాలుష్యం నుండి రక్షించే బాధ్యతను తీసుకోవాలి : మంత్రి పొన్నం

వన మహోత్సవం -2024 కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ కమాండ్

Update: 2024-12-20 06:13 GMT

దిశ, ఖైరతాబాద్ : వన మహోత్సవం -2024 కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ వెనుక భాగంలో గల లింక్ రోడ్డు ప్రాంతంలో పెద్దఎత్తున చేపట్టే ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ,అటవీ శాఖ అధికారులు,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంది.యావత్ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి పౌరుడు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సంకల్పం తీసుకోవాలి అన్నారు.

రాబోయే కాలంలో హైదరాబాద్ ను కాలుష్యం నుండి రక్షించే బాధ్యతను తీసుకోవాలి.దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడింది ..వలస పోయి వేరే దగ్గర బతుకే పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాద్ అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని నివారించడానికి వాహనాలకు ఈవీ పాలసీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరంలో అన్ని వాహనాలు ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు ఆటోలు ఎలక్ట్రిక్ వాహనాలు గా మారుస్తాం , కాలపరిమితి పూర్తి చేసుకున్న జీహెచ్ఎంసీ వాడే వాహనాలు స్క్రాప్ కి ఇచ్చి ఈవి వెహికల్ గా మారుస్తాం , 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం..చెట్లు చాలా అవసరం సామాజిక బాధ్యతగా రోజు వారి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం పెంచడం చేసుకోవాలి , వాతావరణాన్ని కాపాడడానికి..పర్యావరణం కాపాడడం మన అందరి బాధ్యత అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.


Similar News