దిశ,కార్వాన్ః తెలంగాణలోని గ్రంథాలయాలు కేరళను మించేలా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పౌర గ్రంథాలయ శాఖ పద్మశ్రీ డాక్టర్ ఎస్ అర్ రంగనాథన్133వ జయంతి, జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం అఫ్జల్ గంజ్ లోని రాష్ట్ర ,కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏవిఎన్ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశ్రీ డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణత సాధిస్తూ వివిధ రంగాల్లో స్థిరపడ్డారన్నారు. గూగుల్లో ఇంకా సాంకేతిక టెక్నాలజీ వచ్చినప్పటికీ పుస్తక పఠనం చేయాల్సిందేనని సూచించారు. నూతన ఉద్యోగ నియామకాల గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు నూతన గ్రంథాలయాల ఏర్పాటు ఈ మూడు లక్షలపై అన్ని అన్ని రకాలుగా మద్దతుగా ఉంటానన్నారు. గ్రంథాలయ పోస్టులపై లెటర్ ఇవ్వండి ఏ పోస్టులు క్యాడర్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయో టిజీపీఎస్సీ ద్వారా సీఎంతో మాట్లాడి జాబ్ క్యాలెండర్ లో పెట్టించేలా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయ సెజ్ ద్వారా కచ్చితంగా ఒకటో తారీకు మే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంధాలు మార్చుకునేలా నేటి తరానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రంథాలయ ఉద్యోగులకు జీరో వన్ జీరో ట్రెజరీ ద్వారా జీతాలు అందేలా చూస్తానన్నారు. గ్రంధాలయాలలోకి రావలసిన నిధులు జిహెచ్ఎంసి తో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రియాజ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు గ్రంథాలయాల ఉద్యోగులకు బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయాల పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏవిఎన్ రాజు, గెజిటెడ్ గ్రంథ పాలకులు పి జీ వీ రాణి ,33 జిల్లాల నుంచి వచ్చిన గ్రంథ పాలకులు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.