GHMC: మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలి.. ఫ్లకార్డులతో BRS కార్పొరేటర్లు డిమాండ్

మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-06 06:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని ఫ్లకార్డులతో ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. మేయర్‌కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర ఆగ్రహానికి గురై.. ఆమె సీట్లోంచి లేచి వెళ్లిపోయింది. ఈ ఫిరాయింపుల వెనక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని మండిపడ్డారు. పోడియం చుట్టూ చేరి మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయడంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేశారు. 

Tags:    

Similar News