నకిలీ బ్రాండ్ పేరుతో నకిలీ వైర్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్..

నకిలీ బ్రాండ్ పేరుతో నకిలీ వైర్లు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-11-16 15:10 GMT

దిశ ,కార్వాన్ : నకిలీ బ్రాండ్ పేరుతో నకిలీ వైర్లు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శైలజ తెలిపిన వివరాల ప్రకారం.. తూరూపు బజార్ రామకృష్ణ థియేటర్ వద్ద రాజస్థాన్ కి చెందిన శంభు సింగ్ (30). ద్విచక్ర వాహనంపై ఫినోలెక్స్ ,పాలీ క్లబ్ బ్రాండ్ పేర్లతో కలిగిన నకిలీ వైర్లను అమ్ముతున్నాడు. ఈ క్రమంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి శంభూ సింగ్ ను అదుపులోకి తీసుకొని 100కు పైగా వైర్ బండిల్స్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.


Similar News