మహాశూన్యం కావ్యావిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో యువకళావాహిని నిర్వహణలో జన రచయిత డా. దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన మహాశూన్యం (అనుభావ్య కావ్యం) కావ్యావిష్కరణ శుక్రవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగింది.
దిశ, రవీంద్రభారతి : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో యువకళావాహిని నిర్వహణలో జన రచయిత డా. దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన మహాశూన్యం (అనుభావ్య కావ్యం) కావ్యావిష్కరణ శుక్రవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత ఐఏఎస్ డా. కేవీ రమణ,
సభాధ్యక్షులుగా సారిపల్లి కొండలరావు, సభ ప్రారంభకులుగా డా. మామిడి హరికృష్ణ, ప్రముఖ సాహితీవేత్త, డా. ఓలేటి పార్వతీశం, విశిష్ట అతిథిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు పి. రజనీకుమారి, ఆత్మీయ అతిథులుగా పాలపిట్ట పత్రిక సంపాదకులు గుడిపాటి రాచకొండ, కావ్య అనువాదకురాలు అరుణ రవికుమార్, కళావాచస్పతి లంక లక్ష్మీనారాయణ, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.