భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. పోలీసు వాహనాలు ద్వంసం

మంగళవారం తెల్లవారు జామున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఎల్బి స్టేడియం ప్రహరి గోడ కూలిపోయింది.

Update: 2024-08-20 06:06 GMT

దిశ, కార్వాన్: మంగళవారం తెల్లవారు జామున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఎల్బి స్టేడియం ప్రహరి గోడ కూలిపోయింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్ బాగ్‌లోని సీసీఎస్ పాత కార్యాలయం కు ఆనుకోని ఉన్న రాతి ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయి క్రింద పడింది. ప్రహరి గోడ కూలడంతో దానికి అనుకుని ఉన్న చెట్లు సైతం విరిగి కింద పడ్డాయి. దీంతో ఆ గోడ పక్కన పార్కింగ్ చేసి ఉన్న రెండు పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి.


Similar News