Narsingi ACP: విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ కోసం చాలా వెతికాం
జూబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి(Vijay Madduri) నివాసంలో మోకిలా పోలీసులు నిర్వహించిన సోదాలు ముగిశాయి.
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి(Vijay Madduri) నివాసంలో మోకిలా పోలీసులు నిర్వహించిన సోదాలు ముగిశాయి. జన్వాడ ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసు(Janwada Farmhouse Drug Case)లో భాగంగానే దాడులు చేసినట్లు నార్సింగి ఏసీపీ స్పష్టం చేశారు. తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ కోసం సోదాలు చేసినట్లు తెలిపారు. విజయ్ మద్దూరి(Vijay Madduri) ఇంకా తమకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఆయనకు హైకోర్టు రెండ్రోజుల సమయం ఇచ్చింది. రెండ్రోజుల తర్వాత ఎట్టిపరిస్థితుల్లో విచారణకు హాజరై తీరాల్సిందే అని ఏసీపీ రమణ గౌడ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. జన్వాడ ఫామ్‌హౌజ్(Janwada Farmhouse)లో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్స్ టెస్టులో తేలింది. విజయ్‌కి కొకైన్ ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజ్ పాకాల తనకు కొకైన్ ఇచ్చాడని విజయ్ మద్దూరి(Vijay Madduri) చెప్పినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే విజయ్ మాత్రం దీనిని ఖండించారు.