Arrest : బెల్టుషాపులపై సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి
బెల్టుషాపులలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని
దిశ, చార్మినార్ : బెల్టుషాపులలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ Task Forceపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.71,170 వేల విలువ గల 405 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ... ఛత్రినాక కు చెందిన ప్రభాకర్ రెడ్డి (58), ఉప్పుగూడ కు చెందిన జె. చంద్ర మోహన్ (50)లు ఎటువంటి లైసెన్స్ లేకుండా వివిధ వైన్స్ షాపులలో మద్యం కొనుగోలు చేసి, తమ ఇళ్లలో అక్రమంగా మద్యం నిలువ ఉంచుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అదనపు డీపీసీ అందె శ్రీనివాస్ పర్యవేక్షణలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ Task Forceఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర , ఎస్ ఐలు కె.నరసింహులు ఎన్. నవీన్. జి.ఆంజనేయులు బృందం ప్రభాకర్ రెడ్డి, చంద్రమోహన్ ఇళ్ళలో వేరు వేరుగా దాడులు నిర్వహించింది. అక్రమంగా మద్యం బాటిళ్లను విక్రయిస్తున్న ప్రభాకర్ రెడ్డి, చంద్రమోహన్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.71,170 వేల విలువ గల 405 మద్యం బాటిళ్లలో 82.46 లీటర్ల మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిద్దరిని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.