Hydra : బ‌తుక‌మ్మకుంటపై హైడ్రాకు అనుకూలంగా తీర్పు

అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మకుంట(Bathukammakunta) పున‌రుద్ధర‌ణ‌పై హైడ్రా(Hydra)కు అనుకూలంగా హైకోర్టు(High Court) తీర్పు వెలువరించింది.

Update: 2025-01-07 15:18 GMT

దిశ, వెబ్ డెస్క్ / బ్యూరో : అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మకుంట(Bathukammakunta) పున‌రుద్ధర‌ణ‌పై హైడ్రా(Hydra)కు అనుకూలంగా హైకోర్టు(High Court) తీర్పు వెలువరించింది. బ‌తుక‌మ్మకుంట స్థలం త‌మ‌దంటూ ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద మూడు ద‌శాబ్దాలుగా త‌న‌దిగా చెబుతున్న ఎడ్ల సుధాక‌ర్‌రెడ్డికి హైకోర్టులో మంగ‌ళ‌వారం చుక్కెదురైంది. బ‌తుక‌మ్మ కుంట చెరువు పున‌రుద్ధర‌ణ‌లో హైడ్రా చ‌ర్యలు స‌క్రమ‌మేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంబ‌ర్‌పేట‌లో బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు(V HanumanthaRao) హైడ్రాను సంప్రదించ‌డ‌మే కాకుండా.. సంబంధిత ప‌త్రాల‌ను కూడా అంద‌జేసిన విష‌యం తెలిసిందే. చెరువుల పున‌రుద్ధర‌ణ‌లో భాగంగా న‌వంబ‌రు 13వ తేదీన అబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మకుంటను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌(AV Ranganath) సంద‌ర్శించారు. అదే రోజు పున‌రుద్ధర‌ణ‌కు హైడ్రా చ‌ర్యలు ప్రారంభించింది. హైడ్రా చ‌ర్యల‌పై ఎడ్ల సుధాక‌ర్‌రెడ్డి 14నవంబర్ 24న కోర్టును ఆశ్రయించ‌గా హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ త‌ర్వాత హైడ్రా , రెవెన్యూ, ఇరిగేష‌న్, సంబంధిత శాఖ అధికారులు సర్వే నెం.563/1 లో ఉన్న భూ రికార్డుల‌ను ప‌రిశీలించి కోర్టులో కౌంట‌ర్ దాఖ‌లుచేయ‌గా... ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సీవీ.భాస్కర‌రెడ్డి పిటిష‌న‌ర్ అయిన ఎడ్ల సుధాక‌ర్ రెడ్డికి ఈ భూమిపై ఎలాంటి హ‌క్కులేద‌ని తీర్పుచెప్పారు. అది బ‌తుక‌మ్మ కుంట‌గానే నిర్ధారించారు.

బ‌తుక‌మ్మకుంట‌పైన 2017 సంవ‌త్సరంలో హైకోర్టు డ‌బుల్ బెంచ్ చెరువుగానే తీర్పును వెలువ‌డించిన‌ది. ఫిర్యాదుదారుడికి ఏమైనా హ‌క్కుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాల‌ని సూచించింది. హైకోర్టు తీర్పు ప‌ట్ల హైడ్రా కమిషనర్ హ‌ర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త‌ర‌ఫున సంబంధిత ప‌త్రాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించి.. అనుకూల‌మైన తీర్పు రావ‌డంలో కృషి చేసిన హైడ్రా లీగ‌ల్ బృందంతో పాటు, రెవెన్యూ ఉద్యోగుల‌ను మంగ‌ళ‌వారం హైడ్రా ప్రధాన కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు స‌న్మానించారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కె. ర‌వీంద‌ర్‌రెడ్డి, సీహెచ్. జ‌య‌కృష్ణ, హైడ్రా న్యాయ స‌ల‌హాదారుడు శ్రీ‌నివాస్‌, హైడ్రా లీగ‌ల్ విభాగం లైజినింగ్ అధికారి డి. మోహ‌న్‌, హైడ్రా డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఎల్‌. సుధ‌, త‌హ‌సిల్దార్ ఎం.హేమ మాలిని, త‌హ‌సిల్దార్ పి. విజ‌య్ కుమార్‌, అంబ‌ర్‌పేట త‌హ‌సిల్దార్‌ బి. వీరాబాయి, స‌ర్వేయ‌ర్ కిర‌ణ్‌ల‌తో పాటు ప‌లువురు అధికారుల‌ను ప్రత్యేకంగా అభినందించి.. శాలువతో స‌న్మానించారు.

బతుకమ్మ కుంటకు పూర్వవైభవం

బ‌తుక‌మ్మ కుంట‌కు పూర్వ వైభ‌వం తీసుకురానున్నట్టు హైడ్రా తెలిపింది. 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎక‌రాల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌ ఉంది. బ‌ఫ‌ర్ జోన్‌తో క‌లిపి మొత్తం వైశాల్యం 16.13 ఎక‌రాల విస్తీర్ణం అని అధికారులు తేల్చారు. తాజా స‌ర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి 5.15 ఎక‌రాల విస్తీర్ణం మాత్రమే ఉంది. ప్రస్తుత‌ం మిగిలి ఉన్న 5.15 ఎక‌రాల విస్తీర్ణంలోనే బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధరించేందుకు హైడ్రా చ‌ర్యలు చేపట్టనుంది. బ‌తుక‌మ్మ కుంట చుట్టూ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టనున్న హైడ్రా. బ‌తుక‌మ్మ కుంట‌లో నీటితో క‌ళ‌క‌ళ‌లాడితే ప‌రిస‌ర ప్రాంత‌ల్లో ప‌ర్యావ‌ర‌ణం, భూగ‌ర్భ జ‌లాల పెరుగుద‌ల‌తో పాటు ఆహ్లాద‌క‌రమైన వాతావ‌ర‌ణం ఏర్పడుతుంద‌ని కమిషనర్ తెలిపారు.


Also Read..

HYDRA : బుద్ధ భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్ 

Tags:    

Similar News