Jishnu Dev Verma : మార్పు కోసం చూడకుండా మార్పుకు ప్రధాన పాత్రధారులుగా నిలవాలి

మహిళలు మార్పు కోసం ఎదురు చూడకుండా,

Update: 2024-09-21 15:19 GMT

దిశ, సికింద్రాబాద్: మహిళలు మార్పు కోసం ఎదురు చూడకుండా, మార్పుకు ప్రధాన పాత్రధారులుగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మహిళలకు సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలని, అప్పుడే మహిళలు సాధికారత సాధించగలరని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లోని ఠాగూర్ ఆడిటోరియంలో అఖిల భారత రాష్ట్రీయ సైక్లిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ( ఐసిఎస్ఎస్ఆర్) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఉమెన్ అకాడేమిషన్స్ కాన్ఫరెన్స్ ను శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. 'ఎన్విజనింగ్ న్యూ భారత్' అనే థీమ్ ఆధారంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తో పాటు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి, ఏబిఆర్ఎస్ఎం నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత లక్ష్మణ్, జేఎన్ యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శాంతశ్రీ పండిట్ , ఎన్ హెచ్ ఆర్ సీ చైర్పర్సన్ విజయభారతి, దేవసేన ఐఏఎస్, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక విలువలకు అనుగుణంగా మహిళలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.విద్యకు లింగ బేధం లేదని, విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. చిన్న విషయాలకు కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు.కొత్తదనాన్ని వెతకడం కంటే సంప్రదాయ ఆలోచనలను పునర్నిర్మించి, పునరుద్ధరించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం సుధా మూర్తి మాట్లాడుతూ పురాణాల్లో మహిళలు సమాజానికి విలువలను అందించడంలో కీలక పాత్ర పోషించారని విషయాన్ని గుర్తు చేశారు. మహిళలను విమర్శించకుండా ప్రశ్నించాలని, వారికి మార్గ నిర్దేశం చేయడం తప్ప నియంత్రించ కూడదని సూచించారు.


Similar News