దిశ, ముషీరాబాద్: రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదని, అందులో భాగంగానే ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ మేదర బస్తీలో ఫీవర్ సర్వేను ఎమ్మె్ల్యే ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఈ విధమైనా సర్వే జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరుగుతున్నదని తెలిపారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించి కరోనా బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.
సర్వేకు సహకరిస్తూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ రావు, ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.మోజెస్, మన్నే దామోదర రెడ్డి, ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్, ఎంఏ వాహెద్ అలీ, ఇంద్రసేనా రెడ్డి, కిషన్ రావు, హుస్సేన్, మధు, సందీప్, కళ్యాణ్ నాయక్, సత్యనారయణ, లలిత, ప్రవీణ్, టీవీ రాజు, భోలక్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ మోహన్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.