Hyderabad Collector : నేషనల్ చైల్డ్ పాలసీ ప్రకారం పిల్లలు సంతోషంగా ఉండేలా చూడాలి..

తల్లిదండ్రులు కోల్పోయిన అనాధ పిల్లలకు చైల్డ్ కేర్ సంస్థలు తల్లిదండ్రులు

Update: 2024-11-05 14:30 GMT

దిశ, ఖైరతాబాద్ : తల్లిదండ్రులు కోల్పోయిన అనాధ పిల్లలకు చైల్డ్ కేర్ సంస్థలు తల్లిదండ్రులు గా మారి బాగోగులు చూడడం అభినందనీయమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఐసీపీఎస్, చైల్డ్ కేర్ సంస్థలకు లైసెన్స్ రెన్యువల్ జారీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న అనాధ పిల్లలకు విద్య, మంచి భవిష్యత్తు అందించేందుకు లక్ష్యం నిర్దేశించుకుని ప్రతి శుక్రవారం పిల్లల దత్తత కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్త భవనాలు, మరమ్మతులు, స్థలం, వేకెన్సీ నివేదికను పంపాలని సూచించారు. పిల్లల పట్ల ఆప్యాయత, ప్రేమ కనబరచాలని , పిల్లల బాల్యం ఆనందంగా గడిచేలా వారి బాగోగులు చూడాలన్నారు.

అనంతరం హైదరాబాద్ జిల్లాలోని 50 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లకు కొత్త లైసెన్స్ లను కలెక్టర్ అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు మీరే తల్లిదండ్రులై వారి బాగోగులు చూస్తున్నందుకు అభినందించారు. చైల్డ్ కేర్ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించకుండా నడపాలని సూచించారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సీసీఐలు చట్ట ప్రకారం నడపాలని ఆదేశించారు. పిల్లల బాల్యం ఆనందంగా, సాఫీగా ఉండేలా చూడాలని, హైదరాబాద్ ను ఆదర్శ జిల్లా గా నిలపాలని అన్నారు. ఈ సమావేశంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కేశ్వరరావు, డీసీపీ ఓ లు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Similar News