Breaking: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది....

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో పలుచోట్ల వర్షం(Heavy Rain) కురుస్తోంది. వాతావరణంలో మార్పుల కారణంగా నగరంతో పాటు తెలంగాణ(Telangana)లో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ పరిధిలో కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి ఏరియాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నారు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు చెమటతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో కొద్దిసేపటి క్రితం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగర వాసులు ఉపశపనం పొందుతున్నారు.
మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగు నీళ్లు రోడ్లపై పారాయి. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు ఉండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు అందిస్తోంది. అకాల వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.