హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు GHMC బిగ్ అలర్ట్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి నగరంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఒక్కసారిగా

Update: 2024-07-06 13:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి నగరంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, శేరిలింగంపల్లి, అల్వాల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఖైరతాబాద్, అమీర్ పేట్, పంజాగుట్ట, లక్డీకపూల్, అబిడ్స్, మియాపూర్‌తో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వర్షం నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని నగరవాసులకు జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.  


Similar News