హవాలా నగదు పట్టివేత...
అక్రమంగా తరలిస్తున్న హవాలా నగదును ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రూ. 6,69,000 నగదు స్వాధీనం చేసుకున్న ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ,కార్వాన్ : అక్రమంగా తరలిస్తున్న హవాలా నగదును ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రూ. 6,69,000 నగదు స్వాధీనం చేసుకున్న ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీపీ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటి రాయల్ ప్లాజా బిల్డింగ్ ఎదురుగా భారీ నగదు హవాలా డబ్బు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏసీబీ తన బృందంతో కలిసి రాయల్ ప్లాజాకు వెళ్లి గమనించగా అక్కడ కొంతమంది రోడ్డుపై గుమ్మిగూడారు. ఈ క్రమంలో సంజయ్ కుమార్ మహంకారి(43),భీమర్ భాయ్ దేవాజీ భాయ్ రాజ్‌పుత్(25),అర్జన్ భాయ్ చందాజీ రాజ్‌పుత్(34) అనుమానస్పదంగా బ్లాక్ కలర్ బ్యాగును ఉంచారు. ఆక్రమంలో ఏసీబీ తన బృందంతో కలిసి వారిని చుట్టుముట్టి బ్యాగును తనిఖీ చేయగా అందులో రూపాయలు ఆరు లక్షల అరవై తొమ్మిది వేలు లభించాయి. ఈ నగదు కు సంబంధించిన సరైన పత్రాలు చూపించకపోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు లక్షల అరవై తొమ్మిది వేల నగదుతో పాటు 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆదాయపు పన్ను శాఖకు అప్పజెప్పినట్లు ఏసీపీ తెలిపారు.