పుస్తక ప్రదర్శనకు పెరుగుతున్న ఆదరణ

ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శన రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుంది.

Update: 2022-12-29 17:01 GMT

దిశ, ముషీరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శన రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుంది. ఈ సందర్భంగా పలు పుస్తకాల ఆవిష్కరణలు జరిగాయి. తడక మోహన్ గంగాదేవి సైదులు రచించిన అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ అలిశెట్టిప్రభాకర్ వేదికపై జరిగింది. శీలం భద్రయ్య రచించిన గంగెద్దు కథ సంపుటిని ప్రొఫెసర్ రఘు, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఆవిష్కరించారు. సిద్దెంకి యాదగిరి సంపాదకత్వంలో వెలువడిన చిందునెల కథ సంపుటిని ప్రొఫెసర్ కాశీం, సంగిశేట్టి శ్రీనివాస్, దార్ల వెంకటేశ్వర్ రావు, కోయి కొటేశ్వర్ రావు, పసునూరి రవీందర్ తదితరులు హాజరై ఆవిష్కరించారు. గుడిపల్లి నిరంజన్ వెన్నెల కల జంబూద్వీప తత్వ కవిత్యం అలిశెట్టిప్రభాకర్ వేదికపై ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కాశీం హాజరై సంగిశెట్టి శ్రీనివాస్, దార్ల వెంకటేశ్వర్ రావు, కోయి కొటేశ్వర్ రావు, పసునూరి రవీందర్, స్కైబాబా, సిద్దెంకి యాదగిరిలతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ... విస్మరణకు గురైన కులం నుండి వచ్చి దానికోసం కవిత్వం రాసిన గుడిపల్లి నిరంజన్ జాతికి గర్వకారణమని అన్నారు.

బల్ల సరస్వతి రచించిన కలెనేత ఏడు తరాల తలపోత ఆత్మకథ పుస్తకావిష్కరణ 

బల్ల సరస్వతి రచించిన కలెనేత ఏడు తరాల తలపోత ఆత్మకథ పుస్తకావిష్కరణను రచయిత, రిటైడ్ ఐఎఎస్ చిరంజీవులు, రచయిత, విమర్శకులు అంబటి సురేందర్ రాజు, ప్రొఫెసర్ హరగోపాల్, రచయిత జూపాక సుభద్ర చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పద్మశాలీ కుటుంబీకులు తమ ఇంట్లో గౌరవంగా భద్రంగా దాచుకోవాల్సిన పుస్తకం కలెనేత అన్నారు. కలెనేతపై ఉస్మానియా యూనివర్సిటీలో చర్చకు పెట్టాలని తెలుగు శాఖ ప్రొఫెసర్ కాశీంకు విజ్జప్తి చేశారు. అబంటి సురేందర్ రాజు మాట్లాడుతూ...బల్ల సరస్వతి కలెనేత ఏడు తరాల తలపోతలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి వరకు విస్తారమైన జీవితాన్ని ఏడు తరాల చరిత్రను బల్ల సరస్వతి రాసారన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ పద్మశాలీలు తమ నేత వృత్తిలో అనేక రంగులు ఎలా ఉంటాయో ఈ కలెనేతలో విప్లవభావాలు, బిసి కులవృత్తుల సాధక, బాధకాలను పేర్కొన్నారని చెప్పారు. రచయిత జూపాక సుభద్ర మాట్లాడుతూ... 7 తరాల చరిత్రను ఒక రిజర్వాయర్‌గా తన అనుభవాలను నిక్షిప్తం చేశారని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ... తెలుగులో మహిళ రచయితల్లో ఇద్దరు మాత్రమే ఆత్మకథలు రాశారని, అందులో బల్లసరస్వతి ఒకరని చెప్పారు. గ్రామీణ జీవనంలో పద్మశాలీలు మొదటి విద్యావంతులని కొనియాడారు. అనంతరం వేదిక పై సి ఫర్ క్యాస్ట్ పుస్తక రచయిత సతీష్ చందర్‌తో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి సంభాషణ జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండ నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ చందర్ మాట్లాడుతూ....భారత దేశంలో ఉన్న కోట్లాది ప్రజలు కులం లేనట్లు నటిస్తున్నారన్నారు. ఒక ఆటో వాలా కుమారుడిని ఎస్పీ కూతురు ప్రేమించుకున్నట్లుగా సినిమాలు తీస్తున్నారు కానీ మాల, మాదిగ స్త్రీను ప్రేమించే హీరోలు కనపడరా అని ప్రశ్నించారు. భారత దేశంలో స్త్రీ కులం చేత తీవ్రంగా పీడింపబడుతుందని, కుల సంకరం కాకుండా కాపాడేందుకే బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి మూఢాచారాలు వచ్చాయని అన్నారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.... అట్టడుగు కులం నుండి వచ్చి ఒక సంపాదకుడుగా ఎదగడానికి 100 సంవత్సరాలు పట్టిందని సతీష్ చందర్ అగ్రకుల పత్రికల్లో పనిచేస్తూ కులవ్యవస్థ గురించి సంపాదకీయాలు రాయడం అత్యంత సాహసోపేతమని అన్నారు. సతీష్ చందర్ 32 సంవత్సరాలు సంపాదకుడుగా, కవిగా, రచయితగా బాధితుల వైపు నిలబడి సాహిత్యం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. సతీష్ చందర్ వ్యాస రచన శైలి ఎంతో విలక్షణమైందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉస్మానియా అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్ కొండ నాగేశ్వర్ సమన్వయం చేశారు.

కథకుల సదస్సు

  పుస్తక ప్రదర్శనలో భాగంగా బుక్స్​ డొనేషన్​ బాక్స్​ను ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు పలు పుస్తకాలను వేశారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంట చక్రపాణి, డాక్టర్ కొండ నాగేశ్వర్, ప్రొఫెసర్ షాబాజ్, డాక్టర్ నీరజ, నరేష్ తదితరులతో అలిశెట్టి ప్రభాకర్ వేదిక పై కథకుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథకుడు, సినీ మాటల రచియత పెద్దింటి అశోక్ కుమార్ అధ్యక్షత వహించి తన గుడ్డు దొంగ కథ నేపద్యాన్ని వివరించారు. అలాగే తాళ్ల పల్లి యాకమ్మ తన మౌన సాక్షి కథ ను, మారోజు దేవేంద్ర వెండి బరిణె కథను, వెల్ధండి శ్రీధర్ పొక్కిలి కథను, మన్నె ఎలియా మఱ్ణి చెట్టు కథను, కథ నేపథ్యాలను వివరించారు.  


Similar News