Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణికులకు మెట్రో రైలు సర్వీస్ గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2024-11-05 17:29 GMT
Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణికులకు మెట్రో రైలు సర్వీస్ గుడ్ న్యూస్ తెలిపింది. మెట్రో ప్రయాణికులు మరింత సులువుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా 'గూగుల్ వ్యాలెట్'(Google Wallet)ను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(NVS Reddy) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూగుల్ వ్యాలెట్ వలన ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడి టికెట్ కొనుగోలు చేసే ప్రయాస తప్పుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభించినప్పటి నుంచి ప్రయాణీకుల అవసరార్థం ఎన్నో మార్పులు చేపట్టామని.. ఇకముందు కూడా ప్రయాణీకుల అవసరాలకు తగినట్టు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తామని తెలియ జేశారు.  

Tags:    

Similar News