జ్యువెలరీ షాపులో రూ.6 కోట్ల విలువైన నగలు అపహరణ

హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి.

Update: 2024-10-11 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ ప్రముఖ జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఇది గమనించిన షాప్ యజమాని.. నగలు అపహరణకు గురైనట్లు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జ్యువెలరీ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాప్ మేనేజర్ సుకేతు షాపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త కనిపించడం లేదంటూ బంజారాహిల్స్‌ పోలీసులకు సుకేతు భార్య ఫిర్యాదు చేసింది. షాప్ యాజమాన్యం వేధింపులతో తన భర్త అదృశ్యమయ్యాడు మహిళా ఆరోపిస్తుంది. తన వద్ద జ్యువెలరీ యాజమాన్యం తన భర్త వేధింపులకు సంబంధించి లెటర్‌, ఒక వీడియో ఉందని సుకేతు షా భార్య పోలీసులకు తెలిపింది.


Similar News