హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీయ వద్దు : ఎమ్మెల్యే తలసాని

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దని సనత్ నగర్

Update: 2024-09-13 12:56 GMT

దిశ,బేగంపేట: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో ముందస్తు చర్యలలో భాగంగా మారేడ్ పల్లి సీఐ నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తన హెల్త్ బాగోలేదని, డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉన్నదని వెళ్లాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించినా పోలీసులు వినలేదు,కారు ఎక్కకుండా అడ్డుకున్నారు.

దీంతో శ్రీనివాస్ యాదవ్ ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులు, ప్రతి దాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు. దాడులు చేయడం, రెచ్చగొట్టడం వంటి చర్యలతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించవద్దని అన్నారు. సమస్యకు పరిష్కారం చూడకుండా అరెస్ట్ లు, అడ్డుకోవడాలు తగదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్ అరెస్ట్ అయిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు రాంగోపాల్ పేట, మోండా మార్కెట్ డివిజన్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, కిషోర్ తదితరులు ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు పార్టీ నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Read More : అరెస్టులతో బీఆర్​ఎస్​ శ్రేణులను ఆపలేరు

Tags:    

Similar News