రామమ్మ కుంటలో నిర్మాణాలు కూల్చివేత

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (నిథిమ్) లో చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

Update: 2024-10-01 08:59 GMT

దిశ, శేరిలింగంపల్లి : హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (నిథిమ్) లో చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వేనెంబర్ 71లో మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు విస్తరించి ఉంది.

    ఈ చెరువు చుట్టూ నిథిమ్ క్యాంపస్ విస్తరించి ఉండగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఆ యాజమాన్యం చెరువు బఫర్ జోన్ లో కొత్తగా భవన నిర్మాణం ప్రారంభించింది. చెరువును పూడ్చి భవన నిర్మాణం చేపట్టడంపై పలు స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వివాదం కోర్టుకు చేరగా భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. కాగా కొన్ని రోజుల క్రితం హైకోర్టు సదరు భవనాన్ని తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో కూల్చివేత చేపట్టారు.  

Tags:    

Similar News