ఆ కంపెనీని ప్రమోట్ చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..

క్రికెటర్ యువరాజ్ సింగ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫజల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

Update: 2025-03-24 08:02 GMT
ఆ కంపెనీని ప్రమోట్ చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..
  • whatsapp icon

దిశ, ఖైరతాబాద్ : క్రికెటర్ యువరాజ్ సింగ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫజల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. పూర్తివివరాల్లోకెళితే డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇచ్చిన ప్రమోషన్ ను నమ్మి తాము సదరు కంపెనీకి తమ ఇంటి కన్స్ట్రక్షన్ కోసం కాంట్రాక్టు ఇచ్చామని తెలిపారు. అందుకోసం 13 లక్షలు రూపాయలను కూడా ముట్టజెప్పామని తెలిపారు. ఇప్పుడు నిర్మాణం సంగతి దేవుడెరుగు అసలు ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా ఏవేవో ఖర్చుల పేరుతో కాలయాపన చేస్తున్నారని బాధితుడు ఫజల్ వాపోయాడు. ఈ మేరకు ఆ నిర్మాణ సంస్థకు ప్రమోషన్ చేసిన యువరాజ్ సింగ్ పై, ఆ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు…


Similar News