విదేశాలను నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్ కాల్చివేత.. వాటి విలువ ఎంతంటే…?
విదేశాలను నుంచి దిగుమతి అవుతున్న గంజాయి డ్రగ్స్ ను
దిశ, కార్వాన్ : విదేశాలను నుంచి దిగుమతి అవుతున్న గంజాయి డ్రగ్స్ ను ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దహనం చేశారు. తెలంగాణలోని పది జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నిలువచేసిన గంజాయి డ్రగ్స్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాలతో దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాంపల్లి ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి, బెంగూళూరు, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న 7951 కేజీల గంజాయి డ్రగ్స్‌ను ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీసులు దహనం చేశారు.
వీటి విలువ సుమారు రూ. 11.61 కోట్లు ఉంటుందని తెలిపారు. అక్టోబర్ నెలలో పది జిల్లాలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు.ఆదిలాబాద్ లో 48 కేసుల్లో 412 కేజీల గంజాయి రూ .1,02,98,875, మెదక్ లో 26 కేసులు,107 కేజీలు, రూ రూ.87,27,591, నల్లగొండలో ఒక కేసు 47 కేజిలు రూ .11,76,500 ,సూర్యాపేట లో 15 కేసులు 87 కేజీల రూ. 21,65,100, యాదాద్రి లో 9 కేసులు 12 కేజీల రూ.2,21,009,ఖమ్మం లో 237 కేసులు 1120 కేజీల రూ.1,88,08,299,కొత్తగూడెం లో 34 కేసులు,1164 కేజీల రూ. 2,79,41,921,మేడ్చల్ మల్కాజి గిరిలో 36 కేసులు, రూ. 25,14,275, హైదారాబాద్‌లో 206 కేసులు,2167 కేజీలు రూ. 2,15,56,240,సికింద్రాబాద్ లో 91 కేసులు,1923 కేజీలు రూ. 2,27,80,485 తో పాటు హ్యాష్ ఆయిల్, అల్పోజోలం, వీట్ అయిల్, ఓపీఎం, ఎండిఎంఎ లాంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న వాటిలో చాలాకాలం పలు పోలీస్ స్టేషన్ లో నిల్వ ఉంచిన వాటిని దహనం చేసినట్లు డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి తెలిపారు.