BREAKING: బాలాపూర్‌లో అర్ధరాత్రి కాల్పుల మోత.. రౌడీషీటర్ రియాజ్ దారుణ హత్య

నగరంలోని పాతబస్తీ పరిస్థితి నివురుగప్పిన నిప్పుల మారింది.

Update: 2024-08-09 03:00 GMT

దిశ, బడంగ్‌పేట్: ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన గురువారం అర్థరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. రియాజ్‌కు యాక్సిడెంట్ చేసిన దుంగడులు అనంతరం రివాల్వర్‌తో కాల్పులు జరిపి హతమార్చారు. బాలాపూర్ పోలీసుల కథనం మేరకు.. బాబానగర్ సీ-బ్లాక్‌కు చెందిన రియాజ్ అలియాస్ మెంటల్ రియాజ్ (45) కంచన్‌బాగ్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్. గురువారం అర్ధరాత్రి బాలాపూర్ మంచి స్కూల్ సమీప ప్రాంతం నుంచి బైక్‌పై వెళ్తున్నాడు.

ఈ క్రమంలో అక్కడే మాటు వేసిన దుండగులు పథకం ప్రకారం గుర్తు తెలియని కారుతో రియాజ్ బైక్‌ను ఢీకొట్టారు. అతడు కింద పడిపోయిన వెంటనే ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రివాల్వర్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. స్పాట్‌లో కింద పడిన ఓ బుల్లెట్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ ఛాతి, శరీరం‌లోని ఇతర భాగాలలో గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రియాజ్‌ను ఎవరు హతమార్చారు.. కారణం ఏంటనే విషాయాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News