బూత్ కమిటీలు వేగవంతం చేయాలి: గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

పోలింగ్ బూత్ కమిటీలు 100 శాతం పూర్తవ్వాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదేశించారు.

Update: 2024-12-21 12:08 GMT

దిశ, చైతన్యపురి: పోలింగ్ బూత్ కమిటీలు 100 శాతం పూర్తవ్వాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదేశించారు. బూత్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కమిటీలు వేయాలని సూచించారు. నూతన పోలింగ్ బూత్, డివిజన్, జిల్లా కమిటీల నిర్వహణ కోసం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ నమోదు పోలింగ్ బూత్ కమిటీల నివేదిక సమావేశం శనివారం ఎల్బినగర్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి అర్బన్ జిల్లా పోలింగ్ బూత్ కమిటీ చురుగ్గా సాగుతుందని, డిసెంబర్ 24, 25 తేదీలలోపు డివిజన్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకోవాలన్నారు. డిసెంబర్ 26, 27 తేదీల్లో జిల్లా అధ్యక్షుడు, జనవరి మొదటి వారంలో రాష్ట్ర అధ్యక్షుడిని, రెండో వారంలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ ఆదేశించిందన్నారు. అందుకుగాను నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీ కి అన్ని కమిటీలు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు సుభాష్ చందర్ జి, వానపల్లి శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్లు కొత్త రవీందర్ గౌడ్, రాఘవేందర్ రావు కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి జిల్లా నాయకులు రుద్రారపు శంకర్, పద్మ రెడ్డి, గీత రెడ్డి, నాంపల్లి రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News