బుక్ ఫెయిర్ ను సందర్శించిన హర్యానా గవర్నర్

ముషీరాబాద్, ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలోని 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని స్టాళ్ల ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు.

Update: 2024-12-21 14:20 GMT

దిశ, రాంనగర్ : ముషీరాబాద్, ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలోని 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని స్టాళ్ల ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుక్ ఫెయిర్ పాఠకులు, సందర్శకులు, పుస్తకాల స్టాల్ నిర్వాహకులతో మాట్లాడారు. పుస్తకాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయ సమావేశం లో మాట్లాడుతూ.. లక్షలాది మంది ఆలోచనలు పుస్తక రూపంలో తెచ్చి ప్రజల్లోకి తీసుకు వెళ్ళే రచయితల కృషిని అభినందిస్తున్నాను అన్నారు. పుస్తక పఠనం చాలా అవసరం. పుస్తక పఠనం వల్ల దివ్యమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చని అన్నారు. వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి పుస్తకాలు అవసరమన్నారు. లోతైన విజ్ఞానం రావాలంటే చదువు చాలా అవసరం. నేటి యువతరం కోసం గ్రంథాలయాలను పెంచి పుస్తక పఠనం ప్రోత్సహించాలన్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు యాకూబ్, సెక్రటరీ ఆర్ వాసు, తదితరులు పాల్గొన్నారు.


Similar News