దొరల గుండెల్లో గుబులు రేపిన వ్యక్తి బండి యాదగిరి: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి పాటను రాసి దొరల గుండెల్లో గుబులు రేపిన యాదగిరి తెలంగాణలో...Bandi Yadagiri Birth Anniversary Celebrations

Update: 2022-12-07 14:00 GMT

దిశ, అంబర్ పేట్: బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి పాటను రాసి దొరల గుండెల్లో గుబులు రేపిన యాదగిరి తెలంగాణలో బండి యాదగిరిగా స్థిరపడ్డారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో ఎందరో మహానుభావులు పేరిట తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండి యాదగిరి జయంతి సభ త్యాగరాయ గాన సభ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండెనక బండి కట్టి పాటను పాడి తెలంగాణ దొరల పాలనలో విముక్తి పోరాటంలో ప్రజానీకాన్ని ఉత్తేజపరిచారని కొనియాడారు. యాదగిరి గన్ను పట్టి పోరాటంలో పాల్గొన్న యోధుడని కీర్తించారు. ప్రముఖ రచయిత రమణ వెలమకన్ని మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను వివరిస్తూ బండెనక బండి కట్టి అనే పాటను ప్రతాపరెడ్డి దొరను ఉద్దేశించి రాసిందని వ్యాఖ్యానించారు. మా భూమి సినిమాలో నిజాం పేరును చేర్చారని వివరించారు. సీనియర్ జర్నలిస్ట్ జి. వల్లీశ్వర్ మాట్లాడుతూ.. బండి యాదగిరి వంటి మహనీయుల త్యాగాల వల్లే తెలంగాణ విముక్తి చెందిదని, వారి చరిత్ర నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి అధ్యక్షత వహించిన సభలో సూరి భాగవతం ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఎస్బి రాం, గానసభ పాలకవర్గం సభ్యుడు బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.


Similar News