లెప్రసి వ్యాధి పై అవగాహన కల్పించాలి..

లెప్రసీ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రావు అన్నారు.

Update: 2024-11-28 16:01 GMT

దిశ, చైతన్యపురి : లెప్రసీ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రావు అన్నారు. సరూర్ నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమం, ఎల్సీడీసీ కార్యక్రమం పై జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులు, వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 2 నుండి 15 వ తేదీ వరకు ఆశ కార్యకర్తలు ఉదయం ప్రతీ ఒక్క ఇంటికి వెళ్లి అందరినీ లేప్రోసి వ్యాధి లక్షణాల కోసం పరీక్షలు చేస్తారని చెప్పారు. అనుమానం ఉన్నవారిని దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తారని చెప్పారు.

ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా పారామెడికల్ అధికారి సులోచనలు కుష్ఠు వ్యాధి గుర్తింపు ఉద్యమంలో ప్రతి రోజు సర్వేచేసే విధానం రిపోర్టులు తయారు చేసే పద్ధతి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు లెప్రసి సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన సిబ్బంది, పాల్గొన్నారు.


Similar News