చైనీస్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా అగ్ర తారల పై మరో ఫిర్యాదు

బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసిన టాలీవుడ్ అగ్ర హీరోల పై మరో ఫిర్యాదు ఆదివారం నమోదైంది.

Update: 2025-03-23 13:43 GMT
చైనీస్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా అగ్ర తారల పై మరో ఫిర్యాదు
  • whatsapp icon

దిశ, సిటీక్రైం : బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసిన టాలీవుడ్ అగ్ర హీరోల పై మరో ఫిర్యాదు ఆదివారం నమోదైంది. ఈ ఫిర్యాదును హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఆన్ లైన్ ద్వారా నేషనల్ సైబర్ క్రైం ఫ్రాడ్స్ విభాగానికి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. ఇన్ ఫార్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66 ఎఫ్ బీ సెక్షన్ కింద ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని న్యాయవాది కోరారు. న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదులోని వివరాలు ఇలా...టాలీవుడ్ సినీ హీరోలు నందమూరి బాలకృష్ణ, తొట్టెంపూడి గోపీచంద్, ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ ఫన్ 88 చైనీస్ బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేశారని తెలిపారు. ఈ చైనీస్ ఫన్ 88 బెట్టింగ్ యాప్ లక్షలాది అమాయకులను ఈ యాప్ లో గేమ్స్ ఆడేలా చేసి డబ్బులు పొగొట్టుకునేలా చేసిందన్నారు. ఈ యాప్ లో గేమ్స్ ఆడిన వారి డబ్బును చైనీస్ కంపెనీ మ్యూల్ ఖాతాల(కమీషన్ ల మీద తెరిచిన బ్యాంక్ ఖాతాలు) ద్వారా నగదును మళ్లించిందని ఫిర్యాదులో ఆరోపించారు. తెలంగాణ గేమింగ్ అమెండ్ మెంట్ యాక్ట్ 2017, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం చైనీస్ గేమింగ్ యాప్ లను మన దేశంలో నిషేధించారు. ఈ ఫన్ 88 గేమింగ్ యాప్ లింక్ ను బ్లాక్ చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని న్యాయవాది రామారావు కోరారు.


Similar News