లంచగొండులపై ఏసీబీ పంజా.. జైలుకు 27 మంది ప్రభుత్వ ఉద్యోగులు

చట్టప్రకారం, నిబంధనలకు మేరకు తనకు జరగాల్సిన పనులకు లంచం డిమాండ్‌తో వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కామన్ మ్యాన్ కన్నెర్ర చేశాడు. దీనికి అవినీతి నిరోధక శాఖ తోడయ్యి అక్రమార్కుల ఆటకట్టించేందుకు అండగా నిలబడడంతో నవంబరు నెలలో మొత్తం 27 మంది లంచావతారులను జైలుకు పంపారు.

Update: 2024-12-03 02:19 GMT

దిశ, సిటీ క్రైం: చట్టప్రకారం, నిబంధనలకు మేరకు తనకు జరగాల్సిన పనులకు లంచం డిమాండ్‌తో వేధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై కామన్ మ్యాన్ కన్నెర్ర చేశాడు. దీనికి అవినీతి నిరోధక శాఖ తోడయ్యి అక్రమార్కుల ఆటకట్టించేందుకు అండగా నిలబడడంతో నవంబరు నెలలో మొత్తం 27 మంది లంచావతారులను జైలుకు పంపారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో 27 మంది ప్రభుత్వ అధికారులతో పాటు ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో పంచాయితీరాజ్, విద్యాశాఖ, పోలీసు, మునిసిపల్, టీజీపీడీసీఎల్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, కమర్షియల్ ట్యాక్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్ శాఖలకు చెందిన వారు ఉన్నట్లు ఏసీబీ అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ 27 మంది నుంచి రూ.3.54 లక్షల లంచం డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో సంచలన కేసులో ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ రూ.17.73 కోట్ల అక్రమాస్తుల చిట్టాను ఆధారాలతో బయటపెట్టారు.

ఈ లంచాలకు సంబంధించిన కేసులలో పకడ్బందిగా దర్యాప్తు, విచారణలో కోర్టు ముందు అన్ని సాక్ష్యాధారాలను నిరూపించి ముగ్గురు అవినీతి అధికారులకు కోర్టు జైలు శిక్షలు ఖరారు చేసేలా పని చేశారు. 2013లో లంచం తీసుకుంటు పట్టుబడ్డ జిలగం వెంకటేశ్వరరావుకు ఏడాది జైలు, రూ.20 వేల జరిమానా, తొగూరి పోచయ్య డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 2013లో లంచం తీసుకుంటూ చిక్కడంతో 3 ఏండ్ల జైలు, రూ.3 వేల జరిమానా, పీ.అశొక్ ఏఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2012లో లంచం డబ్బులను జేబులో వేసుకుంటుండగా చిక్కడంతో 2 ఏండ్లు జైలు, రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరైనా లంచం అడిగితే బాధితులు ఎలాంటి అనమానాలు లేకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు 1064, సోషల్ మీడియా ఎక్స్, ఫేసుబుక్‌లలో @telanganACB కు ఫిర్యాదు చేయొచ్చని ఏసీబీ డైరెక్టర్ విజయ్ కుమార్ కోరారు.

Tags:    

Similar News