3 సరిహద్దు చెక్ పోస్టులలో ఏసీబీ అధికారుల తనిఖీలు

ఏసీబీ అధికారులు బుధవారం రాష్ట్ర సరిహద్దు లో ఉన్న 3 ప్రధాన చెక్ పోస్టుల ను తనిఖీలు చేశారు.

Update: 2024-12-04 09:25 GMT

దిశ, సిటీక్రైం : ఏసీబీ అధికారులు బుధవారం రాష్ట్ర సరిహద్దు లో ఉన్న 3 ప్రధాన చెక్ పోస్టుల ను తనిఖీలు చేశారు. మొత్తం 7 టీం లు ఈ తనిఖీల్లో పాల్గొని చెక్ పోస్ట్ సిబ్బంది, అధికారుల వద్ద లెక్క కు రాని వేలాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు జరిపారు. భోరాజ్ (adhilabad) చెక్ పోస్ట్ నుంచి రూ. 62,500, విష్ణుపురం (నల్గొండ ) రూ. 86,600, అలంపూర్ ( గద్వాల్ ) చెక్ పోస్ట్ రూ. 29,200 నగదును అక్కడ పనిచేస్తున్న సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో బయట పడ్డ లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా చెక్ పోస్ట్ సిబ్బంది విధుల పై ప్రభుత్వానికి నివేదికను ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటనలో తెలిపారు.


Similar News