రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మృతి చెందిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, వనస్థలిపురం : వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మృతి చెందిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ ఐ చందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఎక్సల్ టీ వీ ఎస్ వాహనంపై నుండి సోమయ్య, శైమల సమ్మక్క(50) ఇద్దరూ కలిసి నాగోల్ జైపూరి కాలనీ నుండి హయత్ నగర్ వీరన్న గుట్టకు వెళ్లేందుకు పాపయ్య గూడ చౌరస్తా వద్దకు రాగానే వెనుక నుంచి డీ సీఎం వాహనం ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం వెనుక ఉన్న సమ్మక్క అక్కడికక్కడే దుర్మరణం చెందగా, సోమయ్యకు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.