హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య

ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. అడిషనల్ డీసీపీ అశ్వక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2024-06-20 02:33 GMT

దిశ, కార్వాన్: ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. అడిషనల్ డీసీపీ అశ్వక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లె పల్లి చౌరస్తా వద్ద బుధవారం రాత్రి షేక్ హలీం అనే రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు క్షత గాత్రున్ని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునిపై హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Also Read: రాష్ట్రంలో అమానవీయ ఘటన.. మహిళను వివస్త్రను చేసి మరి..


Similar News