వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి
సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు.
దిశ, ముషీరాబాద్: సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. విజయ్ (43) ముషీరాబాద్ వినోబా నగర్ ప్రేయర్ పవర్ చర్చి వద్ద నివాసం ఉంటున్నాడు. ఇతనికి మతిస్థిమితం సరిగా ఉండదని స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో వచ్చిన వరదనీటిలో ఆదర్శ కాలనీ వరకు కొట్టుకుపోయి విజయ్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకొని స్థానికుల నుంచి విచారించి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.