తింటున్న దోశలో బొద్దింక..
సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌లో రాఘవేంద్ర కుమార్ అనే ఓ వ్యక్తి దోశ ఆర్డర్ చేశాడు.
దిశ, ఖైరతాబాద్ : సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్స్‌లో రాఘవేంద్ర కుమార్ అనే ఓ వ్యక్తి దోశ ఆర్డర్ చేశాడు. చూడగానే నోరూరించే దోశ తింటుండగా బొద్దింక రావడంతో షాక్ అయ్యాడు. బొద్దింక రావటం పై యజమాన్యాన్ని ప్రశ్నించినప్పటికీ నిర్లక్ష్యపు సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు, చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. హోటల్ యాజమాన్యం పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.