ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై మలక్ పేట్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

Update: 2024-05-13 11:22 GMT

దిశ, మలక్ పేట్ : మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై మలక్ పేట్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై నవీన్ తెలిపిన వివరాల ప్రకారం... మలక్ పేట్ నియోజకవర్గంలోని హోలీ మదర్ స్కూల్ పోలింగ్ బూత్ నంబర్ 64లో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు సోమవారం ఉదయం 10:45 గంటలకు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత వచ్చారు.

కాగా అదే సమయంలో రఫత్ ఉన్నిసా అనే మహిళ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. రఫత్ ఉన్నిసా ఓటర్ ఐడీ కార్డును పరిశీలించిన మాధవీలత నీ ముఖం సరిపోవడం (మ్యాచ్) లేదని ఆమెతో చెప్పడంతో ఆమె ఓటు వేయకుండా వెనుతిరిగారు. అనంతరం మాధవీలత సరైన వ్యక్తితో ఓటు వేయించాలని చెప్పి వెళ్ళిపోయారు. దీనిపై పోలింగ్ బూత్ (64) లో పని చేస్తున్న ఆస్మాన్ ఘడ్ కు చెందిన బిఎల్ఓ అరుణ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించిన మాధవిలత పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మాధవిలత పై 186,171-C, 505(1)(సీ) ఐపీసీ,132 ఆర్.పీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News