10 కేసుల్లో ముద్దాయి గా ఉన్న గంజాయి డాన్ అంగూర్ బాయి అరెస్ట్
10 కేసుల్లో ముద్దాయిగా ఉన్న గంజాయి డాన్ అంగూర్ బాయిని ఎస్ టీ ఎఫ్,ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
దిశ,కార్వాన్ : 10 కేసుల్లో ముద్దాయిగా ఉన్న గంజాయి డాన్ అంగూర్ బాయిని ఎస్ టీ ఎఫ్,ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పిలువబడుతున్న అంగూర్ బాయిని పోలీసులు పలు మార్లు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఎస్ టి ఎఫ్ , ఎక్సైజ్ పోలీసులు కార్వాన్ లో ఉన్నట్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి గురువారం అరెస్టు చేశారు. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు, మంగళ్ హట్ పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు ఆసిఫ్ నగర్ , గౌరారం స్టేషన్లలో కలుపుకొని మొత్తం 10 కేసుల్లో ముద్దాయిగా ఉండి పలు మార్లు జైలుకు వెళ్లి వచ్చిన అంగూర్ బాయి ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఎస్ టి ఎఫ్ , ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.