Red Heart signal : ఐడియా అదుర్స్.. ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచన

ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. నగరంలో దాదాపు ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ లైట్స్ కనిపిస్తూనే ఉంటాయి.

Update: 2024-10-14 13:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. నగరంలో దాదాపు ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ లైట్స్ కనిపిస్తూనే ఉంటాయి. రెడ్, గ్రీన్, ఎల్లో రంగుల్లో దర్శనమిస్తాయి. అయితే అర్జెంట్‌గా వెళ్లేవారికి జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ కనపడిందంటే చాలు ఎక్కడ లేని చిరాకు కొంత మందికి వస్తుంటుంది. ఈ క్రమంలోనే రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారుల మూడ్ మార్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచన చేశారు.

టాఫ్రిక్ సిగ్నల్‌లో గుండ్రటి రెడ్ లైట్ స్థానంలో రెడ్ హార్ట్ సింబల్‌ వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నానక్ రామ్ గూడ సిగ్నల్ వద్ద రెడ్ హార్ట్ సింబల్ ఏర్పాటు చేసినట్లు వీడియోలు నెట్టింట వైరల్‌గా మాారాయి. ఐడియా అదిరిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా ఫస్ట్ గుంతలు ఉన్న రోడ్లను బాగు చేయాలని, తర్వాత ఇలాంటి ప్రయోగాలు చేయాలని సూచించారు. కాగా, తమిళనాడులోని చెన్నై ట్రాఫిక్ పోలీసులు రెడ్ హర్ట్ సిగ్నల్‌ను గత ఆగస్టులోనే స్టార్ట్ చేశారు.  


Similar News