రాబోయే మూడ్రోజులు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం క్లారిటీ
తూర్పు మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయికి వీస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తూర్పు మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయికి వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని అండమాన్, నికోబార్‌లో కొంత భాగం వరకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది.