Hyderabad: కొడుకు వద్దు, నువ్వు మాత్రమే కావాలన్న భర్త!.. భార్య న్యాయ పోరాటం

దివ్యాంగుడైన కొడకును కన్నావంటూ, భార్యను దూరం పెట్టిన ఓ వ్యక్తి ఇంటి ముందు మహిళ న్యాయ పోరాటానికి దిగింది.

Update: 2024-08-16 07:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దివ్యాంగుడైన కొడకును కన్నావంటూ, భార్యను దూరం పెట్టిన ఓ వ్యక్తి ఇంటి ముందు మహిళ న్యాయ పోరాటానికి దిగింది. ఈ అమానుష ఘటన రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. హైదర్ గూడలో నివాసం ఉంటున్న బీటుకూరు ఉదయ్ భాస్కర్ కు అలైక్య అనే మహిళతో 2014 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2016 లో ఓ కొడుకు పుట్టాడు. బాలుడు పుట్టుకతో దివ్యాంగుడై జన్మించాడు. దివ్యాంగుడైన కొడుకును కన్నావని చెప్పి, తన భర్త ఉదయ్ భాస్కర్ తనని దూరం పెడుతూ వస్తున్నాడు. దీంతో సహనం కోల్పోయిన భార్య అలైక్య దివ్యాంగుడైన కొడుకుతో కలిసి, భర్త ఇంటిముందు బైఠాయించింది.

దివ్యాంగుడైన కొడుకును కన్నావని చెప్పి, భర్త ఉదయ్ భాస్కర్ తనని దూరం పెడుతున్నాడని, తన ఇంటికి వస్తే కొడుకు వదిలేసి ఒంటరిగా రావాలని చెబుతున్నాడని వాపోయింది. దీనిపై కోర్టుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోతోందని, బయట మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడదాం అంటే ఉదయ్ భాస్కర్ స్పందించడం లేదని చెప్పింది. కడుపున పుట్టిన కొడుకును ఎలా వదిలేయాలని, ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎదురు కావొద్దని, పిల్లల్ని కనడంలో భార్య, భర్త ఇద్దరికీ భాగస్వామ్యం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు అలైక్య న్యాయపోరాటానికి దిగింది.

Tags:    

Similar News