HYD : హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్, మణికొండ, షేక్ పేట్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్ పల్లి, మారేడుపల్లి, బేగంపేట్ ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది . ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు కమ్ముకుని వర్షం కురిసింది. వర్షం కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.