HYD : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

Update: 2024-06-25 07:43 GMT

దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం అబుదాబి నుండి హైదరాబాద్ వచ్చిన శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేశారు. సదరు వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని కరిగించి కవర్లలో చుట్టి 5 ఉండలుగా తయారు చేసుకుని అక్రమంగా పురుషనాళంలో దాచిపెట్టి తరలిస్తుండగా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ.58.08 లక్షల విలువ చేసే 806 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


Similar News