Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై బిగ్ అప్డేట్

ఇందిరమ్మ ఇళ్ల(indiramma indlu) లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రంలో ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు.

Update: 2024-10-26 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల(indiramma indlu) లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రంలో ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఈ మేరకు శనివారం (APP)ను పరిశీలించిన ఆయన.. పలు మార్పులు చేయాలని సూచించారు. వచ్చేవారం దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పైరవీలు, రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన అందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు(indiramma indlu) మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాల‌ని సూచించినట్లు పొంగులేటి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయింపు వరకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వీలైనంత‌వ‌ర‌కు వినియోగించుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌ని ఆదేశించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..