Bhatti vikramarka: హైడ్రాపై విమర్శలు.. స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి

హైడ్రాపై విమర్శలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

Update: 2024-10-26 11:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ అభివృద్ధి, హైడ్రా (hydra) పై కావాలనే కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తున్నారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క (bhatti vikramarka) అన్నారు. హైదరాబాద్ లో శనివారం నరెడ్ కో ప్రాపర్టీ షో (NAREDCO Property Show)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించిన డిప్యూటీ సీఎం అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. గోదావరి, కృష్ణ, మంజీరా నుంచి హైదరాబాద్ కు తాగునీరు అందిస్తున్నామని, డ్రైనేజీల ట్రీట్ మెంట్ కు 39 ఎస్టీపీలు మంజూరు చేశామన్నారు. మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్, మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. 30 వేల ఎకరాలలో అద్భుతమన ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ గా ఉంటుందన్నారు. రియల్టర్ల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Tags:    

Similar News